Feb 20,2023 15:53

బెంగళూరు : గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్సీయే)లో కోలుకుంటున్నాడు. ఇప్పటికీ బుమ్రా ఫిట్‌ నెస్‌పై ఎన్సీయే నుంచి స్పష్టత రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియాను ప్రకటించగా అందులో బుమ్రా పేరు లేదు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ బుమ్రా లేడు. దీంతో ఆసీస్‌ సిరీస్‌కు బూమ్రా పూర్తిగా దూరమైనట్టేనని తెలుస్తోంది. కాగా మార్చి 31 నుంచి జరిగే ఐపీఎల్‌ లీగ్‌లో బుమ్రా పాల్గొంటాడాని తెలుస్తోంది