భోపాల్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో భారత యువ షూటర్ రుద్రాంక్ష పాటిల్ భారత్‌కు మరో పతకాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన 10మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష తొలి నుంచి మూడోస్థానంలో నిలుస్తూ వచ్చాడు. ఆ ప్రదర్శననే చివరివరకు కొనసాగించి కాంస్య పతకాన్ని ముద్దాడాడు. థానేకు చెందిన రుద్రాంక్ష తొలుత 9.9పాయింట్లతో ఆ తర్వాత 10.1పాయింట్ల్తఓ అదరగొట్టాడు. చివర్లో 12షాట్స్‌లో 10, 10.5పాయింట్లతో చెలరేగడంతో రుద్రాంక్షకు పతకం ఖాయమైంది. ఈ విభాగంలో చైనాకు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. ఇక మహిళల కేటగిరీలో చైనాకు స్వర్ణం, అమెరికాకకు రజితం, కజకిస్తాన్‌కు కాంస్య పతకాలు దక్కాయి. ఒక పతకాల పట్టిలో చైనా 5స్వర్ణ, 1రజిత, 2కాంస్యాలతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 1స్వర్ణ, 1రజిత, 3కాంస్యాలతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత అజర్‌బైజాన్, జర్మనీ, హంగరీ, అమెరికా ఒక్కో రజిత పతకాలతో ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి.










