ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తొలిరోజే భారత అథ్లెట్ సత్తా చాటాడు. 10వేల మీ. రేస్‌లో స్టార్ అథ్లెటక్ అభిషేక్ పాల్ కాంస్య పతకాన్ని సాధించాడు. డెకథ్లాన్‌లో తేజశ్విని శంకర్ 4124పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించగా.. మహిళల జావెలిన్ లో అన్ను రాణి త్రోయర్‌ను 59.10మీ. విసిరి 4వ స్థానంలో నిలిచింది. అలాగే 400మీ. పరుగు పందెం సెమీస్‌కు రాజేశ్ రమేశ్, మహ్మద్ అజ్మల్ అర్హత సాధించారు. అజ్మల్ 45.76సెకన్లలో గమ్యానికి చేరి 4వ స్థానంలో నిలువగా.. రమేశ్ 45.91సెకన్లలో గమ్యానికి చేరాడు. ఇక మహిళల 400మీ. ఫైనల్‌కు ఐశ్వర్య మిశ్రా(53.59సెకన్లు), మహిళల 1500మీ. పరుగులో లిల్లి దాస్ 4నిమిషాల 27.61సెకన్లలో గమ్యానికి చేరి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు.










