భారత్‌తో టెస్ట్ సిరీస్‌లకు జట్టును ప్రకటించిన కరేబియన్ బోర్డు
ఆంటిగ్వా: రెడ్ బాల్ స్పెషలిస్ట్ బ్యాటర్ క్రెగ్ బ్రాత్‌వైట్ వెస్టిండీస్ జట్టు కెప్టెన్‌గా మరోసారి ఎన్నికయ్యాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ వెస్టిండీస్(సిడబ్ల్యుఐ) శుక్రవారం 18మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఆంటిగ్వాకు చెందిన బ్రాత్‌వైట్ సారథ్యంలోని విండీస్ జట్టు భారత్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది. జింబాబ్వేలో జరుగుతు ఐసిసి వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీలో ఆడుతున్న హోల్డర్, జోసెఫ్, మయర్స్ స్థానంలో హోడ్జ్, అథన్జె, మెక్ అలెస్టర్‌లకు విండీస్ బోర్డు చోటు కల్పించింది. ఇరుజట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌జులై 12నుంచి ప్రారంభం కానుంది. జులై 12నుంచి డోమినిక వేదికగా తొలిటెస్ట్, జులై 20నుంచి ట్రినిడాడ్ వేదికగా రెండోటెస్ట్ జరగనుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన పిమ్మట ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 27నుంచి, ఐదు టి20ల సిరీస్ ఆగస్టు 3నుంచి ప్రారంభం కానున్నాయి.
టెస్ట్ జట్టు: బ్రాత్‌వైట్(కెప్టెన్), అలిక్ అథనజె, బ్లాక్‌వుడ్, బోనర్, చంద్రపాల్, కార్న్‌వాల్, జోషువాాడిసిల్వ, గాబ్రియేల్, హోడ్జ్, జోర్డాన్, మెక్‌అలెస్టర్, మెకెన్జి, మిండ్లే, ఫిలిప్, రీఫెర్, కీమర్ రోచ్, సెలెస్, వారికన్.










