ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండిచారు. చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని విమర్శించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. పోచారం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రిమాండ్ లో ఉన్న ఒక ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. మీ సీఎం కేసీఆర్‌ను అడిగితే ఆయనే చెపుతారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా మాత్రం మాట్లాడకూడదని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు అవినీతి రహితంగా పాలన చేయాలన్నారు.










