May 22,2023 16:21

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మందితో గంగానదిలో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. దాదాపు 20 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. బబ్లియా జిల్లాలోని మల్దేపూర్‌ గంగా ఘాట్‌ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పడవలో ఉన్నవారంతా ఒకే కుటుబానికి చెందిన వారిగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన అక్కడ ఉన్న మత్స్యకారులు.. బాధితులను కాపాడేందుకు వెంటనే నదిలోకి దూకారు. కొంత మందిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరికొందరి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. 20 మందికి పైగా ఆచూకీ లభించడం లేదని అధికారులు తెలిపారు. బాధితుల్లో కొందరు ఆపస్మారక స్థితిలోకి వెళ్లారని.. వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించామని వారు వెల్లడించారు.