Mar 22,2023 16:42

ఢిల్లీ : వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాకు, ఐపిఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న భారత స్టార్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు, ఐపిఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయ్యర్‌ తన గాయానికి లండన్‌లో సర్జరీ చేయించుకోనున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు కూడా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి.. అక్కడి వైద్యులు సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. సర్జరీ చేయించుకున్నాక అతడు కనీసం ఐదు నెలలపాటు ఆటకు దూరం కానున్నాడు.