IPL 2023 RCB VS RR : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీ షాక్ తగిలింది. ఐపిఎల్-2023లో భాగంగా ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు (స్లో ఓవర్ రేట్) ఉల్లంఘించినందుకుగాను, అతనితో పాటు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ (ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు)కు భారీ జరిమానా పడింది
నెమ్మదిగా జట్టు బౌలింగ్..
ఐపిఎల్‌లో ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో .. బెంగుళూరు జట్టుకు కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా చేశారు. అయితే ఆ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. కానీ చాలా నెమ్మెదిగా ఆ జట్టు బౌలింగ్ చేసింది. దీంతో ఐపిఎల్ నిర్వాహకులు కోహ్లీకి 24 లక్షల జరిమానా వేశారు. కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులు కూడా ఫైన్ వేశారు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆ జరిమానాను ఖరారు చేశారు.
ఐపిఎల్‌లో రూ.24 లక్షల జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే..!
ప్రతి ప్లేయర్‌కు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం వసూలు చేయనున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆర్సీబీ జట్టు ఓవర్లు నెమ్మదిగా వేయడం ఇది రెండోసారి. దీంతో అతనికి రూ.24 లక్షల ఫైన్ వేశారు. ఐపిఎల్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ పరిస్థితి మరోసారి రిపీట్ అయితే, ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరు ఉన్నా అతనిపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపిఎల్‌లో 24 లక్షల జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే.










