ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్
లండన్: ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు భారీస్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌ను ఐర్లాండ్ 172పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లండ్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి రెండోరోజు టీ విరామ సమయానికి 2వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే, బెన్ డకెట్ కలిసి తొలి వికెట్‌కు 109పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశారు. క్రాలే(56), బెన్ డకెట్(182) పరుగులు చేసి ఔటయ్యారు. ఇక పోప్‌ాడకెట్ కలిసి 2వ వికెట్‌కు 252పరుగులు జతచేశారు. శుక్రవారం టీ విరామ సమయానికి పొపోవ్(197), రూట్(52) క్రీజ్‌లో ఉన్నారు. హ్యూమే, హ్యాండ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.










