Jul 25,2023 16:39

ప్రజాశక్తి-అంబాజీపేట(కోనసీమ) : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా బిసి యువసేన మహిళా అధ్యక్షురాలుగా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామానికి చెందిన యువ నాయకురాలు మట్టపర్తి భారతిని నియమిస్తూ బిసి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఢిల్లీలో నియామక పత్రం అందించారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదించాలంటూ ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఆమె పాల్గొనడం అభినందనీయమని కృష్ణయ్య ప్రశంసించారు. బిసిల సంక్షేమం కోసం యువసేనలో అవగాహన కల్పించి వారిని మరింత ప్రోత్సహించేలా కృషి చేయాలని భారతికి సూచించారు.