Jan 03,2023 21:16

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల వేదిక భారత్‌ పే సిఇఒ పదవికీ సుహైల్‌ సమీర్‌ రాజీనామా చేశారు. ప్రస్తుత సిఎఫ్‌ఒ నలిన్‌ నేగీని తాత్కాలిక సిఇఒగా నియమిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. సుహైల్‌ సమీర్‌ ఈ నెల 7 నుంచి భారత్‌పే వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరించనున్నారని పేర్కొంది. భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు, ఎండి అష్నీర్‌ గ్రోవర్‌పై తీవ్ర ఆర్థిక దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయడంతో ఆస్థానంలో 2022 మార్చిలో సుహైల్‌ సమీర్‌ నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో భారత్‌ పే నుంచి అనేక మంది ఉన్నతాధికారులు వరుసగా వైదొలగడం ఆ సంస్థను ఆందోళనకు గురి చేస్తుంది. గత నెలలోనే చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ విజరు అగర్వాల్‌, పోస్ట్‌పే హెడ్‌ నెహుల్‌ మల్హోత్రా, కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ రజత్‌ జైన్‌ కంపెనీకి రాజీనామా చేశారు. జూన్‌లో చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ నిషిత్‌ శర్మ వైదొలిగారు.