Sep 28,2023 11:02

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం ముగిసింది. ఈ సారి రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. దాసరి దయానంద్‌ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. వేలం పాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. గత ఏడాది వేలంలో రూ.24.60 లక్షలు పలికిన లడ్డూ.. ఈ సారి అంతకంటే ఎక్కువ పలికింది. బాలాపూర్‌ లడ్డూ వేలానికి నేటితో 30 ఏళ్లు పూర్తి అయినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.