ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ 167వ జయంతి వేడుకలను... స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యంబ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ''స్వరాజ్యమే నా జన్మ హక్కు'' అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని ''జాతి నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐదో తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్. పి శేషారత్నం పాల్గొన్నారు.