Oct 18,2023 21:10

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 17.48 శాతం వృద్థితో రూ.2,020కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,719 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.10,202.71 కోట్లగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో 6.22 శాతం వృద్థితో రూ.10838.24 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.11,206 కోట్లకు చేరింది. 2023 సెప్టెంబర్‌ 30 నాటికి కంపెనీ వద్ద రూ.17,326 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు తెలిపింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ ఎగుమతులు 8 శాతం పెరిగినట్లు వెల్లడించింది.