Jul 01,2023 12:36

నిజామాబాద్‌ : తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు బాబ్లీ ప్రాజెక్ట్‌ 14 గేట్లను ఎత్తివేశారు. దీంతో గోదావరి జలాలు శ్రీరామ్‌సాగర్‌ వైపు పరుగులు తీశాయి. ప్రతీ సంవత్సరం జులై 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరుస్తారు. ఆప్రకారంగానే... ఈరోజు గేట్లను తెరిచారు. మరోవైపు... శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో, ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి మట్టం 1064 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్తాయి నీటి మట్టం 1090 అడుగులుగా ఉంది.