Dec 09,2022 20:45

న్యూఢిల్లీ : వచ్చే 5 నుంచి 7 మాసాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌లో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. సిఐఐ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత 4జి టెక్నలాజీ కలిగిన టవర్లను 5జికి ఆధునీకరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 1.35 లక్షల బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను 5జికి మారుస్తామన్నారు. ఇతర ఏ టెలికం కంపెనీలకు లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు విస్తరించి ఉన్నాయన్నారు. దేశ టెలికం రంగంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ పాత్ర బలంగా, స్థిరంగా ఉందన్నారు.