Jul 26,2023 21:19

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) రూ.10,644.30 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,147.94 కోట్ల నష్టాలు చవి చూసింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలోని రూ.6,870 కోట్ల లాభాలతో పోల్చితే 54.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన క్యూ1లో హెచ్‌పిసిఎల్‌ రెవెన్యూ 7.3 శాతం తగ్గి రూ.1,28,263 కోట్లుగా చోటు చేసుకుంది.