న్యూఢిల్లీ : రిఫ్రిజిరేటర్ విభాగంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ (బిఇఇ) నుంచి 'మోస్ట్ ఎనర్జీ ఎఫీషియెంట్ అప్లయెన్సస్ ఆఫ్ ద ఇయర్ 'అవార్డును అందుకున్నట్లు హైయర్ ఇండియా వెల్లడించింది. ఈ గుర్తింపును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా తీసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంలో ఈ అవార్డును పొందినట్లు పేర్కొంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన హైయర్ హెచ్‌ఆర్‌డి -1955 డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ ఏడాదికి 106 యూనిట్లను మత్రమే వినియోగించి విద్యుత్ పొదుపు చేస్తుందని ఆ కంపెనీ తెలిపింది.










