ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సీనియర్ మహిళా క్రికెటర్లకు గ్రేడ్‌లను ప్రకటించింది. గురువారం జరిగిన బిసిసిఐ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో 2022-23 ఏడాదికి గాను సీనియర్ మహిళా క్రికెటర్లకు గ్రేడ్-ఏ, బి, సిలను కేటాయించింది. గ్రేడ్-ఏలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో రాణించిన శిఖా పాండే, వికెట్ కీపర్ తానియా భాటియా అనూహ్యంగా గ్రేడ్‌లను దక్కించుకోలేకపోయారు. గతంలో గ్రేడ్‌ాఏలో ఉన్న రాజేశ్వరి గైక్వాడ్ గ్రేడ్-బికి పడిపోగా.. గ్రేడ్-ఏలో ఉన్న పూనమ్ యాదవ్‌కు ఈ ఏడాది బిసిసిఐ కాంట్రాక్టును దక్కించుకోలేకపోయింది. ఓ ఏడాదికి కాంట్రాక్టులు దక్కించుకున్న మహిళా క్రికెటర్లలో గ్రేడ్‌ాఏ రూ.50లక్షలు, గ్రేడ్-బి రూ.25లక్షలు, గ్రేడ్-సి రూ.10లక్షలు చొప్పున బిసిసిఐ ఏడాది నగదును అందజేయనుంది.
గ్రేడ్-ఏ : హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ
గ్రేడ్-బి : రేణుక ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రీచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్
గ్రేడ్-సి : మేఘ్న సింగ్, దేవిక వైద్య, ఎస్. మేఘన, అంజలి శర్వాని, పూజ వస్త్రాకర్, స్నే- రాణా, రాధా యాదవ్, హర్లిన్ డియోల్, యస్టికా భాటియా.










