హైదరాబాద్ : న్యూట్రాస్యూటికల్, కాస్మెస్యూటికల్ ఉత్పత్తుల కంపెనీ దక్కన్ హెల్త్‌కేర్ తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్ జెల్, క్విట్ పెయిన్‌ను విడుదల చేసింది. ఈ జెల్‌తో నొప్పుల నుంచి ఉపశమనం పొందడం సులభమని ఆ కంపెనీ పేర్కొంది. క్విట్ పెయిన్‌లో అత్యున్నత సామర్ధ్యం కలిగిన జెల్ ఉందని..ఇది తొమ్మిది రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. కండరాల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, బెణకడం వంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందని దక్కన్ హెల్త్‌కేర్ సిఎండి డాక్టర్ మింటో పురుషోత్తం గుప్తా తెలిపారు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇది తయారుచేయబడటం వల్ల, నొప్పులు, వాపు నుంచి దీర్ఘకాలిక ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. పురాతన భారతీ ఆయుర్వేద విజ్ఞానం, సమకాలీన శాస్త్రీయ పరిశోధనలను అత్యుత్తమంగా మిళితం చేసిన ఒక శక్తివంతమైన ప్యాక్డ్ జెల్‌గా దీనిని అందిస్తున్నామన్నారు.










