ప్రజాశక్తి - మైలవరం (ఎన్‌టిఆర్) : అంతర్జతీయం మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మైలవరం పోలీస్ స్టేషన్ నుంచి నూజివీడు రోడ్డు వరకు పోలీస్, ఎస్‌ఈబి శాఖల సంయుక్త అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ఎస్‌ఈబి సిఐ గిరిజా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను యువత విడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు రాంబాబు, ధర్మరాజు, ఆనంద్ కుమార్, ఎస్ ఈ బి సిబ్బంది పాల్గొన్నారు.










