ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో :గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, యువతలోని ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, దేశ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 'ఆడుదాం ఆంధ్రా' క్రీడలను ప్రారంభించనున్నామని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామన్నారు. చెన్నై ఐపిఎల్ లాగా ఆంధ్రా ఐపిఎల్ క్రీడాకారులను తయారు చేయడానికి విశాఖ, తిరుపతి, మంగళగిరి, రాజమండ్రి ప్రాంతాల్లో 20 ఎకరాలలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. బుధవారం సాయత్రం స్థానిక గ్రాండ్ రిట్జ్ హోటల్ నందు యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ , ఎం.డి.హర్ష వర్ధన్ , సెట్విన్ సిఇఓ మురళి కఅష్ణ, చీఫ్ కోచ్‌లతో పర్యాటక శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణపై సమీక్షించారు.










