న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో సునీల్ ఖండలా ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం అతియా, రాహుల్ పెళ్లికీ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు సునీల్ శెట్టి, అతియా సోదరుడు అహాన్ శెట్టి సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. పెళ్లి ముగిసిన అనంతరం ఫామ్‌హౌస్ బయట ఉన్న వ్యక్తులకు సునీల్ శెట్టి స్వీట్స్‌ను పంపిణీ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''పెళ్లి చాలా బాగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నేను మామయ్యగా ప్రమోషన్ కొట్టేశాను'' అని సునీల్ చెప్పాడు. ఐపిఎల్-2023 ముగిసిన అనంతరం భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తామన్నాడు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు డయానా పెంటీ, క్రిష్ణ ష్రాఫ్, అన్షులా కపూర్ క్రికెటర్స్ వరుణ్ అరోన్, ఇషాంత్ శర్మ తదితరులు హాజరయ్యారు.










