విజయవాడ: కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లికి ముహూర్తం ఖరారు అయింది. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో సెప్టెంబర్ 3వ తేదీన నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి వివాహ ముహూర్తం ఖరారైంది. ఈనెల 22వ తేదీన విజయవాడ సమీపంలోని పోరంకిలోని మురళి రిసార్ట్‌లో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహం రాత్రి 7.59 గంటలకు జరగనుంది. కాగా ప్రస్తుతం వంగవీటి రాధాకఅష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వంగవీటి రాధా కృష్ణ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున తొలిసారి 2004లో గెలిచారు. 2009లో కూడా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే గెలిచి ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారించినా వినకుండా అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.










