కాంస్య పతక పోటీకి మరో నలుగురు
అండర్-20 రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్
అస్తానా(కజకిస్తాన్): ఇక్కడ జరుగుతున్న అండర్-20 మహిళల రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతిమ్ పంగల్ ఫైనల్‌కు చేరి స్వర్ణ పతక పోటీకి సిద్ధమైంది. 18ఏళ్ల అతిమ్.. 53కిలోల విభాగం సెమీస్‌లో అద్భుత ప్రదర్శనతో 8-1పాయింట్ల తేడాతో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన అక్టేంజేపై విజయం సాధించింది. అలాగే భారత్‌కు చెందిన మరో నలుగురు రెజ్లర్లు ప్రత్యర్థులపై నెగ్గి కాంస్య పతక పోటీకి సిద్ధమయ్యారు. బుధవారం జరిగిన 53కిలోల విభాగంలో అన్షు మాలిక్ జపాన్‌కు చెందిన సాేనంజోపై తీవ్రంగా గాయపడ్డా.. పతక పోటీకి అర్హత సాధించగా.. మనీషా(65కిలోలు), రీతికా(72కిలోలు), సోనమ్ మాలిక్(62కిలోలు) ప్రత్యర్థులపై గెలిచి కాంస్య పతక పోటీకి సిద్ధమయ్యారు. ఇక నిషా దహియా(68కిలోలు) రజిత పతకం, ప్రియా(76కిలోలు) కాంస్య పతకాలను సాధించారు.










