Oct 15,2023 14:58

హైదరాబాద్‌ : ఆసరా పెన్షన్‌దారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. ప్రస్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ. 5 వేలకు పెంచుతామని కేసీఆర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తెలంగాఆణ భవన్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు.ఆసరా పెన్షన్లను ఈ భవనంలోనే పుట్టిన నిర్ణయం. రెండున్నర గంటల పాటు గతంలో చర్చించాం. ఆసరా పెన్షన్లకు చాంపియన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ.. పదులు, వందల రూపాయాల్లో ఉన్న స్కీంను వేల రూపాయాలకు తీసుకెళ్లాం. ఆసరా పెన్షన్లను రూ. 5 వేలకు పెంచుతున్నాం. సడెన్‌గా మరుసటి రోజే ఇవ్వం. గవర్నమెంట్‌ వచ్చిన తర్వాత.. ఈ స్కీంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ. 3 వేలు చేస్తాం. ప్రతి ఏడాది రూ. 500 పెంచుకుంటూ.. ఐదో సంవత్సరం నాటికి రూ. 5 వేలు చేస్తాం. దీంతో ప్రభుత్వం మీద భారం పడదు. ఏపీ గవర్నమెంట్‌లో కూడా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తున్నాం. మేం కూడా మరో వెయ్యి పెంచి.. ఏడాదికి పెంచుకుంటూ పోతే రూ. 5 వేలకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతది కాబట్టి ఇంప్లీమెంట్‌ చేస్తాం. వికలాంగుల పెన్షన్‌ను ఇటీవలే రూ. 4 వేలు చేసుకున్నాం. దాన్నిఆరు వేల రూపాయాలకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 5 లక్షల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారు. మార్చి తర్వాత రూ. 5 వేలకు చేస్తాం. ప్రతి సంవత్సరం 300 పెంచుకుంటూ.. ఐదో సంవత్సరం నాటికి రూ. 6 వేలు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.