Jun 22,2023 22:04

ట్‌బాల్‌ కోచ్‌ ఇగార్‌కు రెడ్‌కార్డ్‌
బెంగళూరు: శాఫ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా భారత కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌కు రెడ్‌ కార్డుకు గురయ్యాడు. పాక్‌ ఆటగాడు బంతిని విసరబోతుండగా.. సమీపంలో నిలబడ్డ భారత కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌ చేత్తో వెనుక నుంచి దాన్ని నెట్టేశాడు. దీంతో రెఫరీ అతడికి రెడ్‌ కార్డు చూపించాడు. ఆ తర్వాత భారత్‌, పాక్‌ ఆటగాళ్లు పరస్పరం వాదించుకుంటూ.. ఒకరినొకరు నెట్టుకుంటూ కనిపించారు. ఈ సంఘటనపై భారత కోచ్‌ స్పందించాడు. తానొక పోరాట యోధుడినని, అసలు వెనక్కి తగ్గనని ఇగార్‌ స్టిమాక్‌ స్పష్టం చేశాడు. అలాగే మళ్లీ ఇలాంటివి చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయనని పేర్కొన్నాడు. సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ''ఫుట్‌బాల్‌ అనేది ప్యాషన్‌కు సంబంధించిన అంశం. మీ దేశం కోసం ఆడేటప్పుడు ఎంతవరకైనా పోరాడాలి. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా అలా చేయడంపై కొందరు ద్వేషిస్తారు. లేదా కొంతమంది ప్రేమిస్తారు. నేను పోరాట యోధుడిని. అన్యాయమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా మా ఆటగాళ్లకు అండగా నిలబడేందుకు అవసరమైతే మరోసారి ఇలా చేయడానికైనా నేను సిద్ధమే'' అని ఇగార్‌ తెలిపారు.