ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు జలక్ తగిలింది. బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆ జట్టుకు దూరం అయ్యాడు. ఈ సీజన్‌లోని మిగితా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం లేదు. దీనిపై ముంబై ఇండియన్స్ ఓ ట్వీట్ చేసింది. ఆర్చర్ స్వదేశానికి వెళ్తున్నట్లు పేర్కొన్నది. ఈసీబీ పర్యవేక్షణలో ఆర్చర్ పరిశీలిన కొనసాగుతుందని ముంబై ఇండియన్స్ తెలిపింది. రోహిత్ శర్మ నేతత్వంలోని ఎంఐ జట్టు రెండు కోట్లు పెట్టి ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఆర్చర్ స్థానంలో క్రిస్ జోర్డాన్‌కు ఛాన్స్ ఇచ్చారు. 2016 సీజన్‌లో జోర్డాన్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అతను ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతని ఖాతాలో 27 వికెట్లు ఉన్నాయి. ఆ ఇంగ్లండ్ క్రికెటర్ ఇప్పటి వరకు 87 టీ20లు ఆడాడు. దాంట్లో అతను 96 వికెట్లు తీసుకున్నాడు.










