Feb 01,2023 11:04

ముంబయి : అదానీ కంపెనీ షేర్లపై ఆ సంస్థ ఉద్యోగులే అనాసక్తిని వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ)ల్లో పెట్టుబడులకు వారు దూరంగా ఉండటమే. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఇందులో పెట్టుబడులకు రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఆ కంపెనీ ఉద్యోగులు ఆచితూచి వ్యవహారించారు. జనవరి 31తో ముగిసిన ఈ ఇష్యూలో రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల కోసం 2.29 కోట్ల షేర్లను కేటాయించగా.. 11 శాతం మాత్రమే సబస్రయిబ్‌ అయ్యాయి. ఉద్యోగులు తమకు కేటాయించిన 1.6 లక్షల షేర్ల లో 52 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలు అయ్యాయి. ఈ ఎఫ్‌పిఒతో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ రూ.20,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. కాగా.. 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.62 కోట్లకు బిడ్లు దాఖ లయ్యాయి. నాన్‌ ఇన్స్‌ట్యూట్‌ ఇన్వెస్ట ర్లు, క్వాలిఫైడ్‌ ఇన్స్‌ ట్యూషనల్‌ బయ్యర్స్‌ విభాగంలో ఎక్కు వగా దరఖాస్తులు రావడంతో పూర్తిగా సబ్‌స్రయిబ్‌ అయ్యింది.
        అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర మోసాలకు పాల్పడు తున్నాయని అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు గౌతం అదానీ ఊహించని నష్టాలు చవి చూస్తున్న విషయం తెలిసిందే. స్టాక్‌ మార్కెట్లలో వరుస భారీ నష్టాలతో అదానీ టాప్‌ -10 కుబేరుల జాబితాలో చోటు కోల్పోయారు. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి దిగజారారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ మంగళవారం ఓ రిపోర్టులో తెలిపింది. 2022లో అదానీ అత్యధికంగా రూ.3.2 లక్షల కోట్ల సంపదను కూడబెట్టుకున్నారు. లక్షల కోట్ల సంపద కోల్పోయినప్పటికీ.. ఇప్పటికీ అదానీ భారత ధనవంతుల్లో ఒక్కటో స్థానంలో ఉన్నారు. ముకేష్‌ అంబానీ రూ.6.7 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరులతో పోల్చితే రిలయన్స్‌ అధినేత 13వ స్థానంలో ఉన్నారు. ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్‌ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. మూడేళ్ల క్రితం అదానీ సంపద రూ.1.62 లక్షల కోట్లుగా ఉండగా.. ఇటీవల రూ.10 లక్షల కోట్ల చేరువకు వెళ్లింది. జాతీయవాదం పేరుతో దేశాన్ని క్రమపద్దతిలో దోచుకుంటుంది.'' అని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే.