Apr 08,2023 09:28
  • లక్నో సూపర్‌జెయింట్స్‌ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి

లక్నో : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 121పరుగులే చేయగా.. ఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు 16ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 127పరుగులు చేసి ఘన విజ యం సాధించింది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ మార్‌క్రమ్‌ తొలిగా బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(8) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(31), రాహుల్‌ త్రిపాఠి(35)కలిసి 2వ వికెట్‌కు 29పరుగుల జతచేశారు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ జట్టు వరుసగా మరో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో 55పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అత్యధిక బిడ్‌ రూ.15కోట్లకు వేలంగా దక్కించుకున్న హారీ బ్రూక్‌ కేవలం 3పరుగులే చేసి వెనుదిరిగాడు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కూడా డకౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌పై ఆశలు వదులుకుంది. చివర్లో సుందర్‌(16), అబ్దుల్‌ సమద్‌(21) బ్యాట్‌ ఝుళిపించారు. కృనాల్‌ పాండ్యాకు మూడు, అమిత్‌ మిశ్రాకు రెండు, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో రాజస్తాన్‌కు ఓపెనర్‌ మయర్స్‌(13) నిరాశపరిచినా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(35), కృణాల్‌ పాండ్యా(34) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆదిల్‌ రషీద్‌ ఒకే ఓవర్లో కేఎల్‌ రాహుల్‌, షెఫర్డ్‌ను ఔట్‌ చేసినా.. పూరన్‌(11), స్టొయినీస్‌(10) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.రషీద్‌కు రెండు, భువనేశ్వర్‌, ఫారుఖీ, ఉమ్రన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కృనాల్‌ పాండ్యాకు లభించింది. దీంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. సన్‌రైజర్స్‌ 10వ స్థానంలోనుంది.

స్కోర్‌బోర్డు..
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (ఎల్‌బి)కృనాల్‌ 31, మయాంక్‌ (సి)స్టొయినీస్‌ (బి)కృనాల్‌ 8, త్రిపాఠి (సి)అమిత్‌ మిశ్రా (బి)యశ్‌ ఠాకూర్‌ 35, మార్‌క్రమ్‌ (బి)కృనాల్‌ పాండ్యా 0, హారీ బ్రూక్‌ (స్టంప్‌)పూరన్‌ (బి)బిష్ణోరు 3, వాషింగ్టన్‌ సుందర్‌ (సి)దీపక్‌ హుడా (బి)అమిత్‌ మిశ్రా 16, అబ్దుల్‌ సమద్‌ (నాటౌట్‌) 21, ఆదిల్‌ రషీద్‌ (సి)దీపక్‌ హుడా (బి)అమిత్‌ మిశ్రా 4, ఉమ్రన్‌ మాలిక్‌ (రనౌట్‌) దీపక్‌ హుడా/ఉనాద్కట్‌ 0, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0, అదనం 3, (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 121పరుగులు. వికెట్ల పతనం: 1/21, 2/50, 3/50, 4/55, 5/94, 6/104, 7/108, 8/109 బౌలింగ్‌: మయర్స్‌ 1-0-5-0, ఉనాద్కట్‌ 3-0-26-0, కృనాల్‌ పాండ్యా 4-0-18-3, యశ్‌ ఠాకూర్‌ 3-0-24-1, రవి బిష్ణోరు 4-0-16-1, అమిత్‌ మిశ్రా 4-0-23-2.
         

లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ : మయర్స్‌ (సి)మయాంక్‌ (బి)ఫారూఖీ 13, కేఎల్‌ రాహుల్‌ (ఎల్‌బి)ఆదిల్‌ రషీద్‌ 35, దీపక్‌ హుడా (సి అండ్‌ బి)భువనేశ్వర్‌ 7, కృనాల్‌ పాండ్యా (సి)అన్మోల్‌ప్రీత్‌ (బి)ఉమ్రన్‌ 34, స్టొయినీస్‌ (నాటౌట్‌) 10, షెఫర్డ్‌ (ఎల్‌బి)ఆదిల్‌ రషీద్‌ 0, నికోలస్‌ పూరన్‌ (నాటౌట్‌) 11, అదనం 17. (16 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 127పరుగులు. వికెట్ల పతనం: 1/35, 2/45, 3/100, 4/114, 5/114 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-19-1, సుందర్‌ 1-0-11-0, ఫారూఖీ 3-0-13-1, మార్‌క్రమ్‌ 2-0-14-0, రషీద్‌ 3-0-23-2, నటరాజన్‌ 3-0-23-0, ఉమ్రన్‌ 2-0-22-1.