Dec 30,2022 11:53

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక గురువారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట రోకా వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహ తేదీని వెల్లడించనున్నట్లు రిలయన్స్‌ కంపెనీ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ వేడుకలో ప్రముఖ బాలీవుడ్‌ హీరోలు షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌లు తళుక్కుమన్నారు.
కాగా, అనంత్‌, రాధికా చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. రాధికా మర్చంట్‌ ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఇవో విరెన్‌ మర్చంట్‌, శైలా మర్చంట్‌ల కుమార్తె. ఈమె భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. ఇక నీతా అంబానీ, ముఖేష్‌ అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రస్తుతం రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాధిక ఎంకోర్‌ హెల్త్‌కేర్‌ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.