Mar 26,2023 13:19

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియప్‌ 2023లో భారత్‌ తరుపున 48 కిలోల విభాగంలో నీతూ గంగాస్‌ తొలి స్వర్ణం గెలిచింది. స్వీటీ 81కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీటర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత్‌కు గర్వకారణంగా నిలిచారని అభినందిస్తూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ వద్ద భారత బాలిక మెరిసిందంటూ ఢిల్లీ పోలీసు విభాగం ట్విట్టర్‌ పోస్ట్‌ను ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు. ''బంగారు పతకాన్ని గెలుచుకున్న స్వీటీ, నీతూకి అభినందనలు. భారత్‌ మిమ్మల్ని చూసి గర్విస్తోంది''అంటూ వేరొకరు చేసిన ట్వీట్‌ని రీట్వీట్‌ చేశారు. ఈ ఇద్దరు యువ ఛాంపియన్లకు ప్రధాని మోడీ సైతం అభినందనలు తెలియజేశారు.