లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్, స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ తొలిరౌండ్‌లో సునాయాసంగా విజయం సాధించాడు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో అల్కరాజ్ 6-0, 6-2, 7-5తో ఛార్డీ(ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. తొలి సెట్‌లో ఒక్క పాయింట్‌నూ ప్రత్యర్ధికి కోల్పోకుండా మ్యాచ్‌ను గెలుపొందడం విశేషం. ఇతర పోటీల్లో 8వ జెన్నిస్ సిన్నర్(ఫ్రాన్స్) 6-2, 6-2, 6-2తో సెరెండులో(అర్జెంటీనా)పై, 4వ సీడ్ రూఢ్(నార్వే) 6-1, 5-7, 6-4, 6-3తో లోకోలి(ఫ్రాన్స్)పై గెలిచాడు.
కోకా గాఫ్ ఔట్..
మహిళల సింగిల్స్‌లో ఓ సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన 7వ సీడ్ కోకా గాఫ్ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కోకా గాఫ్ 4-6, 6-4, 2-6తో తన దేశానికే చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి సోఫియా కెనిన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ సుమారు 2గంటల 3నిమిషాలసేపు సాగింది. మరో పోటీలో 3వ సీడ్ రైబకినా(కజకిస్తాన్) 4-6, 6-1, 6-2తో రోజర్స్(అమెరికా)పై చెమటోడ్చి నెగ్గింది.










