May 25,2023 12:45

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌ మధ్వాల్‌ లక్నోపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన జాబితాలో ఆకాశ్‌ మధ్వాల్‌ తొలి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజం అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున కుంబ్లే ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇంతకముందు లసిత్‌ మలింగ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమంగా ఉంది.