Feb 20,2023 21:46

ముంబయి: ఆర్‌ఎస్‌:ఎక్స్‌ విండ్‌సర్ఫింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఐశ్వర్య గణేష్‌ ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. యాచింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మూడు సెలెక్షన్‌ ఆర్‌ఎస్‌:ఎక్స్‌(పడవ) ట్రయల్స్‌లో ఐశ్వర్య మూడు స్వర్ణ పతకాలతో అదరగొట్టింది. దీంతో ఐశ్వర్య 600పాయింట్లు సాధించింది. దీంతో విండ్‌ సర్ఫింగ్‌లో భారత్‌ తరఫున ఓ మహిళా యాచర్‌ ఆసియా క్రీడలకు అర్హత సాధించడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. 19వ ఆసియా క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని, దీంతో తన కల సాకారమైందని' ఐశ్వర్య పేర్కొంది.