Mar 13,2023 21:45
  • డబ్ల్యుటిసి ఫైనల్‌కు టీమిండియా

అహ్మదాబాద్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని భారతజట్టు నిలబెట్టుకుంది. ఇరుజట్ల మధ్య జరిగిన నాల్గో, చివరి టెస్ట్‌ డ్రా కావడంతో సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. చివరిరోజు ఆస్ట్రేలియా జట్టు 78.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలే సూచనలు లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో గంట ముందే మ్యాచ్‌ నిలిచిపోయింది. ట్రావిస్‌ హెడ్‌(90) సెంచరీకి దగ్గర్లో ఔట్‌ కాగా.. లబూషేన్‌(63), స్మిత్‌(10) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ దక్కాయి. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు విరాట్‌ కోహ్లీకి లభించగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు దక్కింది. మరోవైపు శ్రీలంక తొలి టెస్ట్‌లో 2వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారతజట్టు డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుకుంది. డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతం, భారత్‌ 58.80 శాతంతో వరుసగా రెండు స్థానాల్లో ఉండగా.. జూన్‌లో లండన వేదికగా డబ్ల్యుటిసి ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా..)
ఆస్ట్రేలియా : 480, 175/2
ఇండియా : 571