Jun 02,2023 22:15

కొలంబో: మహింద్ర రాజపక్సా స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు సంచలన విజయం సాధించింది. మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 6వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 268పరుగులకు ఆలౌటైంది. అలసంక(91), ధనుంజయ(51), ఓపెనర్‌ నిస్సంక(38), , హేమంత(22) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఫరూఖీ, అహ్మద్‌కు రెండేసి, అజ్మతుల్లా, ముజీబ్‌, నూర్‌ అహ్మద్‌, నబికి ఒక్కో వికెట్‌ దక్కాయి. 269పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 46.5ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. జడ్రాన్‌(98), షా(55), షాహిది(38) బ్యాటింగ్‌లో రాణించారు. రజితకు రెండు, లాహిరు, మతీషాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జడ్రాన్‌కు లభించగా.. ఇరుజట్ల మద్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.