ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : మణిపాల్ హాస్పటల్ - సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ చికిత్సలను నిర్వహిస్తున్నామని సీనియర్ లివర్ స్పెషలిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. నగరంలోని ఓహౌటల్‌లో శనివారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపాల్ హాస్పటల్‌లో అత్యంత క్లిష్టమైన కాలేయశస్త్ర చికిత్సలను కూడా ఇపుడు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కాలేయ మార్పిడి, క్యాన్సర్లకు లివర్ రెసెక్షన్లు, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం మార్పిడి, చిన్న వయసులో కాలేయ మార్పిడి లాంటి చికిత్సలను అందిస్తున్నామని తెలియచేశారు. మణిపాల్ హాస్పటల్ విజయవాడ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ విజయవాడ యూనిట్ ద్వారా కాలేయ చికిత్సలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈసందర్భంగా తమ హాస్పటల్‌లో కాలేయ మార్పిడి పూర్తియిన వారితో ఇంట్రాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.