ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించాల్సిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమావేశం వాయిదా పడింది. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ హైలెవల్ మీటింగ్లో డయాఫ్రం వాల్ మరమ్మతులు, అప్పర్ కాఫర్ డ్యామ్, గైడ్ బండ్పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ కీలక భేటీ వాయిదా పడింది. కేరళలో ఘనంగా జరిగే ఓనం పండగ నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.