Mar 24,2023 22:00

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌300 బ్యాడ్మింటన్‌ టోర్నీ
బస్సెల్‌: స్విస్‌ ఓపెన్‌లో 300 బ్యాడ్మింటన్‌ టైటిల్‌ సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పీవీ సింధు, హెచ్‌ ఎస్‌ ప్రణరు, కిదాంబీ శ్రీకాంత్‌ ఇంటిదారి పట్టారు. డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టీ మాత్రం అదరగొడుతున్నారు. వరుస విజయాలతో క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. తైవాన్‌కు చెందిన ఫాంగ్‌ చిలీ-ఫాంగ్‌ జెన్‌ లీ జంటపై 12-21 21-17 28-26తో సాత్విక్‌-చిరాగ్‌ విజయం సాధించారు. వీళ్లు సెమీస్‌ బెర్తు కోసం జెప్పే బే-లస్సే మొల్మెడే (డెన్మార్క్‌) జోడీతో తలపడనున్నారు.
సింధుకు నిరాశ..
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పివి సింధుకు ప్రి క్వార్టర్స్‌లో నిరాశ తప్పలేదు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో 9వ ర్యాంకర్‌ సింధు 15-21 21-12 18-21తో ఇండోనేషియాకు చెందిన అన్‌సీడెడ్‌ పుత్రి కుసుమ వర్దానీ చేతిలో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 38వ ర్యాంకర్‌ అయిన వర్దానీ సింధుపై గెలుపొందడం ఇదే ప్రథమం. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ ఎస్‌ ప్రణరు పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో ప్రణరు రారు.. అతడిని క్రిస్టో పొపోవ్‌(ఫ్రాన్స్‌) ఓడించాడు.