ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్వహించనుంది. గత నెలలో గ్రామ సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించగా, తాజాగా విద్యార్థుల కోసం విద్యాసంస్థల్లో తాజాగా క్యాంపుల షెడ్యూల్‌ను ప్రకటించింది. కళాశాల విద్యార్థులకు మాండిటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబియు) చేయనున్నారు. ఆధార్ పొంది 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంబియు సర్వీస్ ద్వారా అప్‌డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు డి-యాక్టివేట్ అవుతుందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.