Apr 24,2023 21:55

లాసన్నె: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఏటిపి) తాజా మహిళల ర్యాంకింగ్స్‌లో పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌ మరోదఫా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దీంతో డబ్యుటిఏ ర్యాంకింగ్స్‌లో ఇగా స్వైటెక్‌ టాప్‌లో నిలవడంతో ఇది వరుసగా 56వ వారం. గాయం కారణంగా మియామీ టోర్నమెంట్‌కు దూరమైన స్వైటెక్‌.. కోలుకొని స్టుడర్డ్‌ ఓపెన్‌ డబ్ల్యుటిఏ-500 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరి 2వ ర్యాంకర్‌ అర్యానా సబలెంకాతో పోటీకి సిద్ధమైంది. తాజా ర్యాంకింగ్స్‌లో మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా(చెక్‌) 15వ స్థానానికి పడిపోయింది. స్టుడర్డ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో ప్లిస్కోవా.. స్వైటెక్‌ చేతిలో ఓటమితో ఆ ర్యాంక్‌లో మెరుగుదల కనిపించలేదు. ఇక యుఎస్‌ ఓపెన్‌ మాజీ ఛాంపియన్‌ ఎమ్మా రడుకాను ఏకంగా 17స్థానాలు దిగజారి 85వ స్థానానికి పడిపోయింది. ఇక మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ప్రార్థన(167), అంకిత రైనా(172), రుతుజ(255) ర్యాంకులో నిలిచారు. సింగిల్స్‌లో అంకిత రైనా(274), కర్మన్‌ థండీ(278) ర్యాంకుల్లో ఉన్నారు.


ఏటిపి మహిళల సింగిల్స్‌ టాప్‌-10 ర్యాంకింగ్స్‌..
1. ఇగా స్వైటెక్‌(పోలండ్‌) : 8975(పాయింట్లు)
2. అర్యానా సబలెంకా(బెలారస్‌) : 6891( ,, )
3. జెస్సికా పెగూలా(అమెరికా) : 5735( ,, )
4. అన్స్‌ జబీర్‌(ట్యునీషియా) : 5116( ,, )
5. కరోలినా గార్సియా(ఫ్రాన్స్‌) : 5030( ,, )
6. కోకా గాఫ్‌(అమెరికా) : 4400( ,, )
7. ఎలేనా రైబకినా(కజకిస్తాన్‌) : 4303( ,, )
8. డారియా కసట్కినా(రష్యా) : 3503( ,, )
9. మరియా సక్కారి(బ్రిటన్‌) : 3191( ,, )
10. పెట్రా క్విటోవా(చెక్‌) : 3162( ,, )