Jul 05,2023 19:11

భద్రాచలం: తెలంగాణలోని భద్రాచలంలో మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకే పొజ్జా అనే మహిళకు నొప్పులు రావడంతో ఈ నెల 2వ తేదీన భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. బుధవారం సాయంత్రం మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉంది. మగ శిశువులు 1.8 కిలోలు, 1.75 కిలోలు బరువు ఉండగా.. ఆడ శిశువు 1.5 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాన్పు అనంతరం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామకఅష్ణ తెలిపారు. మహిళకు ఇది ఎనిమిదో కాన్పు కాగా.. తాజాగా జన్మించిన శిశువులతో కలిసి ఆ ఇంట్లో సంతానం 10కి చేరింది.