- సెన్సెక్స్ 66,590కి చేరిక
ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ పరుగులు పెడుతున్నాయి. సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 66,590కి చేరి.. నూతన గరిష్ట స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 157 పాయింట్లు రాణించి 19,732 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఎస్‌బిఐ అత్యధికంగా 3 శాతం లాభపడింది. విప్రో, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, గ్రాసిమ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, ఇండుస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ 0.85 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీలో పిఎస్‌యు బ్యాంకింగ్ సూచీ 2 శాతం, ఐటి 0.4 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి.










