యాషెస్ సిరీస్ రెండోటెస్ట్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
లండన్: యాషెస్ సిరీస్ తొలిటెస్ట్‌లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్‌కు జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగే రెండోటెస్ట్‌కు ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్‌బోర్డు 18మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఆ జట్టులో లెగ్ స్పిన్నర్ రేహన్ అహ్మద్ అనూహ్యంగా చోటు దక్కించకున్నాడు. బర్మింగ్‌హామ్ తొలిటెస్ట్‌లో గాయపడ్డ మొయిన్ అలీ స్థానంలో 18ఏళ్ల రేహన్ అహ్మద్‌కు చోటు దక్కింది. గత ఏడాది పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడైన రేహన్.. కరాచీ టెస్టులో ఏడు వికెట్లతో సత్తా చాటాడు. లిసెస్టర్‌షైర్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రేహన్ 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు తీయడంతోపాటు 33.10తో యావరేజ్ 629పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలున్నాయి. లార్డ్ వేదికగా 28నుంచి ఆస్ట్రేలియాతో రెండోటెస్ట్ ప్రారంభం కానుంది.










