Sep 30,2022 12:46

ప్రజాశక్తి-భవానిపురం (ఎన్‌టిఆర్‌) : స్కూటీని లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి ఇండియన్‌ ఐఓసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ కొత్త స్కూటీ కొనుక్కొని దుర్గ గుడి వైపు వెళుతుండగా లారీ ఢీకొట్టింది. మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్తకి ఎలాంటి గాయాలూ కాలేదు. సంఘటనా స్థలానికి ట్రాఫిక్‌ పోలీసులు చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.