కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాకాండాలో శనివారం టిఎంసి గూండాల చేతిలో హతమైన సిపిఎం కార్యకర్త రాజిబుల్ హక్యూకు ఆదివారం ఘనంగా నివాళిఅర్పించారు. బిష్ణుపూర్ గ్రామానికి చెందిన హక్యూ మృతదేహన్ని ఈస్ట్ బుర్దవాన్ జిల్లా పార్టీ కార్యాలయంలో సందర్శనార్థం ఉంచారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం, ఇతర నాయకులు, వందలాది పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం హక్యూ స్వగ్రామానికి మృత దేహాన్ని తరలించారు. అంత్యక్రియలు నిర్వహించారు.










