May 11,2023 20:31
  • ఎఎఫ్‌సి ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

దోహా: ఈ ఏడాది జరిగే ఎఎఫ్‌సి ఆసియాకప్‌-2023 ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత్‌కు క్లిష్టమైన గ్రూప్‌లో చోటు దక్కింది. కతారా ఒపేరా హౌస్‌లో జరిగిన ఎఎఫ్‌సి టోర్నీ భారత్‌కు గ్రూప్‌-బిలో చోటు లభించింది. ఇదే గ్రూప్‌లో భారత్‌తోపాటు పటిష్ట జట్లయిన సిరియా, ఉజ్బెకిస్తాన్‌, ఆస్ట్రేలియాఉన్నాయి. భారత ఫుట్‌బాల్‌ జట్టు తొలిసారి ఈ టోర్నమెంట్‌కు వరుసగా రెండోసారి అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించే క్రమంలో భారతజట్టు తొలుత ఫిలిప్పీన్స్‌, పాలస్తీనా జట్ల చేతిలో ఓడినా.. ఆ తర్వాత హాంకాంగ్‌తో చివరి పోరులో గెలిచి ఎఎఫ్‌సి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. దోహా వేదికగా తీసిన డ్రాలలో అంతర్జాతీయ రిఫరీ యోషిమి యమషిత, మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు టిమ్‌ కాహిల్‌, హసన్‌ అల్‌ హెడోస్‌, పార్క్‌ జీ-సింగ్‌, సర్వర్‌ జెపరోవ్‌, సన్‌ వెన్‌ మరియు భారత మహిళలజట్టు కోచ్‌ మేమోల్‌ రాకీ ఈ డ్రాలలో పాల్గొన్నారు. ఎఫ్‌ఐసి టోర్నమెంట్‌లో భారత్‌ గతంలో 1964, 1984, 2011, 2019లలో ప్రాతినిధ్యం వహించి ఐదోసారి ప్రధాన టోర్నీ బరిలో దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు చొప్పున మొత్తం ఆరు గ్రూపుల్లో 24జట్లు టైటిల్‌కై తలపడనున్నాయి.

ఎఎఫ్‌సి ఆసియాకప్‌-2023 గ్రూప్‌లు..
గ్రూప్‌-ఏ : కతార్‌, చైనా, తజికిస్తాన్‌, లెబనాన్‌
గ్రూప్‌-బి : ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్‌, సిరియా, ఇండియా
గ్రూప్‌-సి : ఇరాన్‌, యుఏఇ, హాంకాంగ్‌, పాలస్తీనా
గ్రూప్‌-డి : జపాన్‌, ఇండోనేషియా, ఇరాక్‌, వియత్నాం
గ్రూప్‌-ఇ : కొరియా, మలేషియా, జోర్డాన్‌, బహ్రెయిన్‌
గ్రూప్‌-ఎఫ్‌: సౌదీ అరేబియా, థారులాండ్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, ఓమన్‌