Dec 02,2022 21:01

సెన్సెక్స్‌కు 416 పాయింట్ల నష్టం
ముంబయి : వరుసగా ఎనిమిది రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు శక్రవారం నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో ఉదయం నుంచే నష్టాలను ఎదుర్కొన్నాయి. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 415 పాయింట్లు కోల్పోయి 62,869కి పడిపోయింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 117 పాయింట్లు తగ్గి 18,696 వద్ద ముగిసింది. వరుస లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరించారని నిపుణులు పేర్కొన్నారు. ఆటో, బ్యాంకింగ్‌ వంటి కీలక రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.