Dec 26,2022 21:26

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేటును ప్రకటించింది. 700 రోజుల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డిలపై 7.60 శాతం వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. రిటైల్‌ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ అధిక వడ్డీ రేటు ప్లాన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఎఫ్‌డిలపై ఆ బ్యాంక్‌ అందిస్తున్న వడ్డీ రేట్లలో ఇదే గరిష్టం. ఈప్లాన్‌ డిసెంబర్‌ 26 నుంచి అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్‌ తెలిపింది.